ఓటు హక్కు వినియోగం పై అవగాహన ర్యాలీ

ప్రజాశక్తి-గొలుగొండ ( అనకాపల్లి) : మండలంలోని ఏ ఎల్ పురం గ్రామంలో గురువారం ఓటు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో అందరూ ఖచ్చితంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన వారు ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఏపిఎం మన మాట్లాడుతూ 85 సంవత్సరాల నుండి వృద్ధులు అందరికీ ఇంటి నుండి ఓటు వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ కొండబాబు, ఐకెపి సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

➡️