కబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోవాలి

Feb 15,2024 22:25

మాట్లాడుతున్న వివిధ సంఘాలు, పార్టీల నాయకులు
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
కబ్జాలు చేయడమే కాకుండా వాటిని సరైనవని చూపించుకునేలా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్‌ చేశారు. మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ విడుదల లక్ష్మీనారాయణ భాదితుల సంఘం సమావేశం స్థానిక వెంకటేశ్వర థియేటర్‌ ఎదురుగా ఉన్న భాస్కర్‌ సినీ ఫంక్షన్‌హాల్‌లో గురువారం నిర్వహించారు. సమావేశానికి అఖిల పక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు హాజరుకాగా సిపిఎం పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పసుమరులోని సర్వే నంబరు 16/1ఎ లో రెడ్‌ మార్కు ఉన్న భూమిని సర్వే నంబర్‌ మార్పు చేసి 16/ 1 వేసి దానిని రిజిస్ట్రేషన్‌ చేసిన అంశంలో సర్వేయర్లు, తహశీల్దారు, రిజిస్ట్రార్‌ కార్యాలయ ఉద్యోగులు అందరూ కలిసి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఎస్సీలు సెంటు, రెండు సెంట్లు చొప్పున కొన్నారని, ఇప్పుడు వారు నష్టపోతున్నారని చెప్పారు. రహదారిని లక్ష్యంగా చేసుకుని అడ్డంగా గోడ కట్టడంతో భూములకు విలువ తగ్గి అక్కడ స్థలాలున్నవారు మానసిక క్షోభకు గురవుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు కలుగజేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. పలు పార్టీలు, సంఘాల నాయకులు మాట్లాడుతూ 2005లో అప్పటి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ అక్కడున్న బ్రిడ్జి పడిపోవటంతో రహదారి కోసం వందల సంవత్సరాల నాటి డొంకనే తాత్కాలికంగా రహదారిగా చేసి మున్సిపాలిటీ నుంచి నిధులను మంజూరి చేయచి రహదారిగా వేయించారని, ఆ తరువాత మెటల్‌ రోడ్లు వేశారని తెలిపారు. అది రహదారి అని తెలిసి కొనుగోలు చేయటం తప్పు కాదా అని ప్రశ్నించారు. విడదల లకీëనారాయణ ఇప్పటికైనా తప్పు తెలుసుకోవాలని, అడ్డుగా కట్టిన గోడను తొలగించేయాలని కోరారు. లేకుంటే ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

➡️