కలుజు మరమ్మతులు చేపట్టడం దారుణం

Dec 25,2023 21:22
ఫొటో : మాట్లాడుతున్న వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబు రెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబు రెడ్డి
కలుజు మరమ్మతులు చేపట్టడం దారుణం
ప్రజాశక్తి-కోవూరు కోవూరు నుంచి పాటూరు గుమ్మళ్లదిబ్బ వెళ్లే రహదారి చెరువు వద్ద ఉన్న కలుజు కోసం ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి రూ.2.45కోట్లు కలుజు నిర్మాణం కోసం సత్వరమే మంజూరు చేయించినప్పటికీ ప్రతిపక్ష టిడిపిలో జనసేనలో ఓర్వలేక సోమవారం మరమ్మతులు చేపట్టడం దారుణమైన విషయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబు రెడ్డి విమర్శించారు. సోమవారం కోవూరులోని వైసిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 29న కలుజు నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడానికి తేదీని కూడా ఎంఎల్‌ఎ ప్రసన్న కుమార్‌ రెడ్డి ఖరారు చేసినప్పటికీ ప్రజలను మభ్యపెట్టే విధంగా టిడిపి జనసేన కలుజుపై తాత్కాలిక మరమ్మతులు చేపట్టి జెండాలు నాటడం ఓర్వలేని తనమన్నారు. గత నాలుగేళ్ల నుంచి ఎంఎల్‌ఎ దానిపై దృష్టి సారించి వెంటనే రూ.245కోట్లతో కలుజు నిర్మించడానికి శ్రీకారం చుట్టినటు తెలిపారు. కోవూరు ఎఎంసి చైర్మన్‌ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2004 నుండి ఎంఎల్‌ఎగా ఉన్న సమయంలో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎలాంటి అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి శివుని నరసింహారెడ్డి, మండల కన్వీనర్‌ నలుబోలు సుబ్బారెడ్డి, సచివాలయం కన్వీనర్‌ కవరగిరి ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️