కలెక్టర్‌ను కలిసిన మున్సిపల్‌ ఛైర్మన్‌

ప్రజాశక్తి-కనిగిరి: ప్రకాశం జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ను ఒంగోలులోని కలెక్టర్‌ కార్యాలయంలో కనిగిరి మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ మర్యాద పూర్వకంగాను కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ మాట్లాడుతూ కనిగిరి పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ అధికమవుతోందని, బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయిన దృష్ట్యా ఆ పనులను త్వరితగతిన చేపట్టాలని ఆయన కోరారు. బైపాస్‌ రోడ్డు నిర్మాణం పూర్తయితే కనిగిరి మున్సిపాలిటీలో ప్రజలకు ట్రాఫిక్‌ సమస్యలు ఉండదన్నారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు త్వరగా నష్టపరిహారం అదే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరితగతిన పరిష్కరించేం దుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట బీసీ నాయకులు చింతలపూడి వెంకటేశ్వర్లు ఉన్నారు.

➡️