కాకినాడ పార్లమెంటు బరిలో సునీల్‌

Jan 9,2024 23:35
ప్రముఖ పారిశ్రామిక వేత్త

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

ప్రముఖ పారిశ్రామిక వేత్త చలమలశెట్టి సునీల్‌ మరోసారి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ముచ్చటగా మూడు సార్లు మూడు పార్టీల నుంచి కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిని మూటగట్టు కున్నారు. నాలుగోసారి అధికార వైసిపి నుంచి బరిలో నిలిచి తన రాజకీయ భవిష్యత్‌ను పటిష్టం చేసుకునేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. చలమలశెట్టి సునీల్‌ వరుసగా మూడు సార్లు కాకినాడ పార్లమెంట్‌ బరిలో దిగారు. మూడు ఎన్నికల్లోనూ మూడు పార్టీల తరుపున రంగంలో దిగినా ఆయనకు పరాజయం తప్పలేదు. ఆయన అనుసరించిన తప్పిదాలతో పార్లమెంట్‌లో అడుగు పెట్టే అవకాశాన్ని చేజార్చుకున్నారని రాజకీయ విశ్లేషకుల భావన. జర్మనీలో పారిశ్రామికవేత్తగా ఉన్న సునీల్‌ 2009లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి ఎన్నికల్లో తొలిసారిగా ప్రజారాజ్యం తరుపున పోటీ చేశారు. ఆ తర్వాత 2020 ఆగస్టులో జగన్‌ గూటికి చేరారు. రాజ్యసభ ఛాన్స్‌ కోసమే ఆయన మళ్ళీ వైసిపి తీర్థం పుచ్చుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే 2014 ఎన్నికల్లో రెండోసారి కూడా ఆయన కాకినాడ ఎంపీగా రంగంలో దిగారు. వరుసగా రెండు ఎన్నికల్లోనూ సునీల్‌ కు ఓటమి తప్ప లేదు. 2014లో మాత్రం అతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా నిరాశ చెందకుండా వైసిపి నేతగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. కొన్ని కారణాల రీత్యా జగన్‌కు ఆయన దూరమ య్యారు. 2019 ఎన్నికల్లో వైసిపిని వీడిని ఆయన టిడిపిలో చేరి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపి అభ్యర్థిగా పోటీ చేశారు అయితే ముచ్చటగా మూడు పార్టీలు మారి పోటీ చేసినా ఆయనకు హేట్రిక్‌ ఓటమి తప్పలేదు. వరుసగా ఎన్నికల ఫలి తాలతో చేతులు కాల్చుకున్న సునీల్‌ మరోసారి వైసిపి నుంచే పోటీ చేయా లని భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది. వాస్తవానికి ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడడం లేదని ఆయన సన్ని హితులు చెబుతున్నారు. కానీ వైసిపి అధిష్టానానికి ఎంపీ అభ్యర్థులు కరువ వ్వడంతో సునీ ల్‌తో చర్చలు జరుప ుతున్నట్లు సమాచారం. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఆమె అక్కడ నుంచే అసెంబ్లీ బరిలోకి దిగనున్నారు. టిడిపి, జనసేన పొత్తు కుదర డంతో ఆ పార్టీ ఉమ్మడి అభ్యర్థి బరిలోకి దిగుతారు. జనసేన నుంచి ప్రముఖ వ్యాపారవేత్త సానా సతీష్‌ బాబు పోటీలో ఉంటారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు టిడిపికి సీటు కేటాయిస్తే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఆశి స్తున్నారు. టిడిపి-జనసేన అధిష్టానాలు పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల ఖరారుపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాకినాడ ఎంపీగా పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరు గుతుంది. ఒకవేళ ఆయనే గనుక ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఉంటే వైసిపి ఇదే స్థానం నుంచి ముద్రగడ్డ పద్మనాభంను పోటీలో నిలబెడతారని సమాచారం. పవన్‌ కళ్యాణ్‌ కాకుంటే కచ్చితంగా సునీలే వైసిపి ఎంపీ అభ్యర్థి అని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వరుసగా మూడు పార్లమెంట్‌ ఎన్నికల్లో మూడు పార్టీల తరుపున పోటీ చేసి ఓడిన ఆయన నాలుగో సారి పాత పార్టీ తరుపున పోటీలో నిలిచి తన రాజకీయ భవిష్యత్‌ను తేల్చుకోనున్నారు. అయితే ఆ యన అభ్యర్థిత్వంపై అధికార వైసిపి నిగ్గుతేల్చల్సావుంది.

➡️