‘కామ్రేడ్‌ సూరసాని’ మార్గం అనుసరణీయం

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో గురువారం విశ్రాంత వ్యవసాయ అధికారి కామ్రేడ్‌ సూరసాని లక్ష్మిరెడ్డి ఐదవ వర్థంతి సభ పిసి కేశవరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి హాజరై సూరసాని లక్ష్మిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్‌ సురసాని లక్ష్మిరెడ్డి వ్యవసాయ అధికారిగా రైతుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. ప్రజా సమస్యలపై కూడా ఎంతగానో కృషి చేశారని తెలిపారు. కనిగిరిలో సుందరయ్య భవనం నిర్మాణానికి స్థలాన్ని అందించడంతోపాటు నిర్మాణానికి కషి చేశారన్నారు. కనిగిరిలో ప్రజా ఉద్యమాలలో కీలక భూమిక వహించారని అన్నారు. ప్రజల కోసం శ్రమించిన లక్ష్మిరెడ్డి లాంటివారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. నిస్వార్థంగా ప్రజల కోసం, ఉద్యమాల కోసం చూపిన చొరవ ఎనలేనిదని అన్నారు. లక్ష్మిరెడ్డి చూపిన మార్గం అనుసరణీయమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెవివి నాయకులు వి మాలకొండారెడ్డి, విశ్రాంత ఎంఈఓ ఓ మాలకొండారెడ్డి, సిపిఎం నాయకులు పిల్లి తిప్పారెడ్డి, పి మహేష్‌, బడుగు వెంకటేశ్వర్లు, రాయళ్ల మాలకొండయ్య, లక్ష్మిరెడ్డి సతీమణి తిరుపతమ్మ, కుటుంబ సభ్యులు విజరు కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️