కార్మిక వర్గ పొరాటాలపై నిర్లక్ష్యం తగదు : సిపిఎం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాష్ట్ర ప్రభు త్వం కార్మిక వర్గ పోరా టాలను నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం తగదని, తక్షణమే వారి కోరికలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభు ్యరాలు ఐ.ఎన్‌. సుబ్బమ్మ, నగర కార్యదర్శి ఎ. రామమోహన్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం నగరంలోని పూలే సర్కిల్లో కార్మికవర్గ పోరా టాలకు సంఘీభావంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గంపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టినట్టు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి గతంలో అం గన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్‌ కార్మికులు, తదితర రంగాల ఉద్యోగులు, కార్మి కులకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు కషి చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్‌సి, డిఎ బకాయిలు వేల కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణమే చెల్లింపులు చేపట్టాలని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కా రం చేసి పోరాటాలను విరమింపజేయకుండా నిర్భందం, బెదిరింపుల ద్వారా, కార్మికుల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తోం దన్నారు. ఈ పద్ధతుల ద్వారా కార్మికుల పోరాటాలను నిర్వీర్యం చేయడం సాధ్యం కాదని వారన్నారు. కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరలేదని, పరిష్కా రానికి అవకాశం ఉన్న సమస్యలు మాత్రమే అడుగుతున్నాని పేర్కొన్నారు. జిల్లాలో కార్మికుల ఐక్యతను చీల్చే ప్రయత్నం అధికార పార్టీ నేతలు తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు జమీ ల, మహబూబ్‌ తార, షకీలా, రమాదేవి, వెంకట సుబ్బమ్మ, కామేశ్వరమ్మ, లతీఫా, రసూలా, అల్లాబీ, ఎం వెంకటేశ్వర్లు, షాకీర్‌, గోవిందు పాల్గొన్నారు.

➡️