కార్యకర్తలు పూర్తి సమయం పార్టీకి కేటాయించాలి

Mar 13,2024 21:42

 ప్రజాశక్తి-విజయనగరం కోట :  నియోజక వర్గ నాయకులు, కార్యకర్తలు పూర్తి సమయం పార్టీకి కేటాయించాలని టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయం అశోక్‌ బంగ్లాలో విజయనగరం నియోజకవర్గ విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్‌ త్వరలోనే వచ్చేస్తుందని అందుచేత మనందరం ఈ ఎన్నికల కాలంలో పూర్తి సమయం పార్టీకి కేటాయించాలని కోరారు. . వివిధ అనుబంధ కమిటీల సభ్యులంతా ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్నారు. సోషల్‌ మీడియాలో కూడా పార్టీ శ్రేణులంతా యాక్టివ్‌ గా ఉండాలని, శంఖారావం – బాబు సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాలపై ఇంటింటి ప్రచారం చేయాలన్నారు. సమావేశంలోనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టిడిపి ఇంటింటి ప్రచారంటిడిపి ఎస్‌సి సెల్‌ నాయకులు 11వ డివిజన్‌ కాటవీధి ప్రాంతంలో ఇంటింటి ప్రచారం చేశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో దళితులకు అందించిన పథకాలను వివరిస్తూ, దళితులకు రక్షణ, ఆర్ధిక, సామాజికాభివృద్ది కల్పించాలంటే టిడిపి -జనసేన పార్టీలకు మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌సి సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి రవిశంకర్‌, నియోజకవర్గ అధ్యక్షులు గొండేల ప్రకాష్‌, కె.పైడిరాజు, దాన రాంబాబు పాల్గొన్నారు.

➡️