కాలుష్య నివారణకు చర్యలు తీసుకోండి

Nov 30,2023 20:24

ప్రజాశక్తి- కొత్తవలస:  కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ డిమాండ్‌ చేసింది. పట్టణ కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ గురు వారం పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో కొత్తవలస జంక్షన్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి, అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.హర్ష మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా ఎస్‌ఎఫ్‌ఐ సామాజికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా పోరాటం చేస్తుంద న్నారు. కొత్తవలస ప్రాంతంలో తరచూ ప్రయాణిస్తున్న విద్యార్ధులు, వివిధ తరగతుల ప్రజలు దుమ్ము, దూళితో ఇబ్బంది పడుతున్నారని దీనివల్ల అనారో గ్యానికి గురవుతున్నారని, మరోపక్క ఇదే ప్రాంతంలో ఉన్న పాలకులు రోజూ ఇదే రోడ్డులో, పట్టణంలో తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. అధికారులకు ఎంత చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. కంటకాపల్లి, గోత్రా కంపెనీ నుంచి వస్తున్న లారీలు మితిమీరి సరుకు ఎక్కించి ప్రధానంగా కాలుష్యం పెంచుతున్నాయన్నారు. కాలుష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నాయుడు, చైతన్య, తేజ, గణేష్‌, భరత్‌, విక్రమ్‌, దీపక్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️