కుష్టు వ్యాధి రహిత సమాజమే లక్ష్యం

ప్రజాశక్తి – చాపాడు కుష్టు వ్యాధి రహిత సమాజమే లక్ష్యమని జిల్లా కుష్టు వ్యాధి నివారణ అధికారి డాక్టర్‌ రవిబాబు తెలిపారు. చాపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ బుధవారం నుండి జనవరి 12 వరకు జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలనా కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఆశా కార్య కర్తలు, వాలంటీర్లు, ఎఎన్‌ఎంలు, ఎంఎల్‌ హెచ్‌పిలు సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మండలాన్ని కుష్టు వ్యాధి రహితంగా చేసేం దుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాది óకారి డాక్టర్‌ రాజేష్‌ కుమార్‌, డాక్టర్లు శ్రీవాణి, కావ్య మాధురి, సిహెచ్‌ఒ మహాదేవ్‌ యాదవ్‌, మండల ఆరోగ్య విస్తరణ అధికారి మాచనూరు రాఘవయ్య, సూపర్‌వైజర్‌ బాబురెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.ఖాజీపేట : కుష్టు వ్యాధి ప్రాణాంతకం కాదని వైద్యులు తెలిపారు. స్థానిక పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ ఎస్‌.ముబీన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర కుష్టు వ్యాధి నివారణ జాయింట్‌ డైరెక్టర్‌, డాక్టర్‌ ఎస్‌.దేవసాగర్‌, జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ రవిబాబుగారు, ఫిజియో థెరపిస్ట్‌ విక్టర్‌ మనోహర్‌ లెప్రసీ కేసు డిటెక్షన్‌ క్యాంపెయిన్‌ నిర్వహించారు. ఇంటింటా కుష్టు వ్యాధి సర్వేను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూనవారిపల్లి సచివాలయంలోని పుల్లూరు దళితవాడ గ్రామం తనిఖీ చేశారు. కార్యక్రమంఓ డాక్టర్‌ ముబీన్‌, మండల ఆరోగ్య విస్తరణ అధికారి బి.నాగభూషణం, ఆశ నోడల్‌ పర్సన్‌ అరుణకుమారి, సూపర్‌వైజర్స్‌ శోభన్‌బాబు, బి.కృష్ణప్రియ, ఎంఎల్‌హెచ్‌సి స్వర్ణలత, రోజారమణి, ఆశా కార్యకర్తలు మేరీ, ఉమామహేశ్వరి పాల్గొన్నారు.

➡️