కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

నరసరావుపేటలో దీక్షలు చేస్తున్న ఉద్యోగులు
 ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేసి, క్రమబద్దీకరించాలని తదితర డిమాండ్లతో గుంటూరు, పల్నాడు జిల్లా కేంద్రాల్లో చేపట్టిన సమ్మె బుధవారమూ కొనసాగింది. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సమ్మె శిబిరంలో ఎపి ఎన్‌జిఒ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.శ్రీనివాసరావు, ఎస్‌.సతీష్‌కుమార్‌, నాయకులు సూరి పాల్గొని మద్దతు తెలిపారు. అలాగే రాష్ట్ర ఐటిఐ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు పవన్‌కుమార్‌, గుంటూరు ఎంఇఒలు జ్యోతి కిరణ్‌, వెంకటేశ్వరరావు, ఎపిజిఇఎ అధ్యక్షులు చాంద్‌బాషా పాల్గొని సంఘీభావం తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరికీ హెచ్‌.ఆర్‌ పాలసీ అమలు చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అందరికీ మినియం ఆఫ్‌ టైం స్కేల్‌ , హెచ్‌ఆర్‌ఎ, డిఎ ఇవ్వాలని, వేతనాలు పెంచాలని నాయకులు కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎఎల్‌ఎస్‌ శ్రీనివాసరావు, ఎంఒ ప్రసాద్‌, యుటిఎఫ్‌ తుళ్లూరు నాయకులు ఎంఎ.ఖాసిం, మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్షా జెఎసి జిల్లా నాయకులు ప్రకాష్‌, అబ్దుల్‌ రెహమాన్‌, గంగయ్య , కిరణ్‌కుమార్‌, శివపార్వతి, మాధురి, దుర్గా, జెఎసి జిల్లా చైర్మన్‌ బి.లక్ష్మణరావు పాల్గొన్నారు. నరసరావుపేటలో సమ్మె శిబిరాన్ని బార్‌ అసోసి యేషన్‌ అధ్యక్షులు ఎం.నాగేశ్వరరావు, న్యాయవా దులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఎం.సాం బశివరావు, జి.శ్రీనివాసరావు, పి.రామకృష్ణ, పి.సాంబ శివరావు, వై.సుబ్బాయమ్మ, కె.శ్రీనివాసరావు, వి.పద్మావతి, డి.లక్ష్మి, బి.కోటేశ్వరరావునాయక్‌, సుభాని, జె.నాగలక్ష్మి పాల్గొన్నారు.

➡️