కోటిపల్లిలో ఎంపీ బోస్ పర్యటన

Jan 28,2024 14:52 #Konaseema

ప్రజాశక్తి రామచంద్రపురం (కోనసీమ) :అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆదివారం కే గంగవరం మండలంలోని కోటిపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కుమ్మరసావరం, శెట్టి బలిజపేట, దళిత పేటలో పర్యటించారు. అదేవిధంగా త్వరలో జరిగే ‘‘నాడు సిద్ధం.. నేడు సిద్ధం’’ కార్యక్రమానికి కార్యకర్తలంతా తరలిరావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి వైసిపి గెలిపించుకోవాలన్నారు. ఈ కారక్రమంలో కోటిపల్లి అబ్బు, మానే చిన్నా, పెమ్మాడి మల్లేశ్వరరావు, పంపన సుబ్బారావు, కుందూరు సర్పంచ్ పంపన సత్యానందం, కూళ్ల సర్పంచ్ చిల్లే నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️