కోటి సంతకాల సేకరణ

ప్రజాశక్తి-కనిగిరి : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు సంతకాల సేకరణతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిసి. కేశవరావు మాట్లాడుతూ ఎస్మా చట్టం పేరుతో అంగన్‌వాడీలను బెదిరించలేరని తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ వారి పోరాటం ఆగదన్నారు. ఎన్నికలకు ముందు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌.సుజాత, సీత, రజిని, భాగ్యలక్ష్మి, రాజేశ్వరి, సౌందర్య, రామ సుబ్బులు, డివైఎఫ్‌ఐ నాయకుడు నరేంద్ర, జెవివి నాయకుడు జి. శ్రీనివాసులు, ఐద్వా నాయకులు ఎస్‌కె.బషీరా, శాంత కుమారి, ప్రసన్న, అంగన్‌వాడీలు తదితరులు పాల్గొన్నారు.మార్కాపురం : సమ్మెలోభాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తొలుత పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ప్రదర్శన చేపట్టారు. గాంధీ పార్కువద్ద కోటి సంతకాల సేకరణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.రూబెన్‌. జె.నాగరాజు, ఎఐటియుసి నాయకులు అందె నాసరయ్య, షేక్‌ ఖాశిం, దుప్పట్ల కాశయ్య, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.గిద్దలూరు రూరల్‌ : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. అంగన్‌వాడీల సమ్మెకు అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు డికెఎం రఫి మద్దతు తెలిపి మాట్లాడారు. అనంతరం సంతకాల సేకరణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు స్వర్ణ, మున్నా, విజయలక్ష్మి, వరలక్ష్మి, సిఐటియు నాయకులు టి.ఆవులయ్య, సింగరయ్య, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.దర్శి : సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలను సిడిపిఒ బెరింపులకు గురిచేయడం సరికాదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జివి. కొండారెడ్డి తెలిపారు. అంగన్‌వాడీల సమ్మెకు కొండారెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తిరుపతమ్మ, నాగమణి, బాలమ్మ, సుజాత, సరోజ, ప్రశాంతి, విశ్వవాణి, దేవిబాయి, శివకుమారి, వెంకటరమణ, యశోద, లక్ష్మీ, రమ్య, సిఐటియు నాయకులు తాండవ రంగారావు, ఈమని నాగేశ్వరరావు, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.యర్రగొండపాలెం : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకురాలు మల్లేశ్వరి, పి సుభాషిణి, నాగ మల్లేశ్వరి, అరుణ కుమారి, సుజాత, రోజా, సుబ్బలు, సునీత, అరుణ, జయమ్మ, నాగరాజ కుమారి, సుబ్బులు పాల్గొన్నారు.పెద్ద దోర్నాల : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ నాయకులు షేక్‌ ముంతాజ్‌, సుబ్బమ్మ, వెంకటలక్ష్మి, భారతి, ధనలక్ష్మి, మేరికుమారి, కాశీశ్వరి పాల్గొన్నారు.నాగులుప్పలపాడు : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు మాట్లాడుతూ సమ్మెలోఉన్న తమ ఇంటి తలుపులకు బెదిరింపులతో కూడిన షోకాజ్‌ నోటీసులు అంటించడం సరైన పద్టతి కాదన్నారు. అంగన్‌వాడీల సమ్మెకు కౌలు రౖతు సంఘం జిల్లాసహయ కార్యదర్శి టి.శ్రీకాంత్‌, సిఐటియు నాయకుడు జి.బసవపున్నయ్య, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జె.జయంతిబాబు, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు వెంకటసుబ్బమ్మ, దూర్గా భవాని, రమ,అరుణ పాల్గొన్నారు.మద్దిపాడు : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. అనంతరం కోటి సంతకాల సేకరణను ప్రారంభించారు. దీక్షా శిబిరం వద్ద ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి బంకా సుబ్బారావు, పల్లాపల్లి ఆంజనేయులు, నాయకులు ఉబ్బా ఆదిలక్ష్మి, అంగన్‌వాడీ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు జయప్రద ధనలక్ష్మి, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.సిఎస్‌ఫురం రూరల్‌ : అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కెవిపిఎస్‌ మండల కార్యదర్శి బక్క జేసురత్నం డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల సమ్మె మద్దతు తెలుపుతూ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ నాయకులు ఉప్పల పాడు సర్పంచి ఎంబడి ప్రవీణ్‌కుమార్‌, సచివాలయం పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌కు అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ నాయకులు, అంగన్‌వాడీలు తదితరులు పాల్గొన్నారు.కంభం రూరల్‌ : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. అంగన్‌వాడీల సమ్మెకు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లంకా నరసింహ రావు మద్దతు తెలిపి మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు డీకే.రఫీ, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తాటిశెట్టి ప్రసాద్‌ బేస్తవారిపేట మండల అధ్యక్షుడు ముంతల మధు సూదన్‌రెడ్డి,ప్రధాన కార్యదర్శి దమ్ము తిరుపాలు, అంగన్‌వాడీలు తదితరులు పాల్గొన్నారు.వెలింగడ్ల : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ముక్కు మహాలక్ష్మి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జీవో నెంబర్‌-2, ఎస్మా చట్టం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జగనన్నకు చెబుదాం, కోటి సంతకాలు విన్నపం కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ చేపట్టారు. దీక్షా సమయంలో హెల్పర్‌ జీవమణి అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోవటంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఈ కార్యక్రమంలో రెడం తిరుపతమ్మ, గొర్రెముచ్చు సలోమి, తాతపూడి ప్రమీల, దొడ్డ హైమావతి, బిజ్జమ్‌ జయమ్మ, మాదిరెడ్డి అరుణ, చిలకల వెంకట నారాయణమ్మ, రాయల రమాదేవి, మల్లేశ్వరి, ముంగార కుమారి, శెట్టి సునీత, పద్మ తదితరులు పాల్గొన్నారు.పొదిలి : అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పిఎంపి అండ్‌ ఆర్‌ఎంపి అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సయ్యద్‌ ఇమాంసా డిమాండ్‌ చేశారు. సమ్మెలో భాగంగా అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని జగనన్నకు చెబుదాం-కోటి సంతకాల సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షుడు అబ్దుల్‌ హై మాట్లాడుతూ కుటుంబం జీవించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కోసం అంగవాడీలు సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి మొండివైఖరితో సమస్య జఠిలమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ కొనకనమిట్ల మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాసర్‌ అహ్మద్‌, కామేశ్వరావు, పొదిలి మండల యుటిఎఫ్‌ ప్రధాన కార్యదర్శిి వెంకటేశ్వర్లు, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పొదిలి ప్రాజెక్టు అధ్యక్షురాలు శోభారాణి, నాయకులు శారద, లక్ష్మీదేవి, వెంకటమ్మ, షమీమ్‌, యల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️