కోర్టు వద్ద లాయర్ల నిరసన

ప్రజాశక్తి-దర్శి: దర్శి బార్‌ అసోసియేషన్‌ న్యాయ వాదుల ఆధ్వర్యంలో ప్రభుత్వం తెచ్చిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ కోర్టులో నిరసన తెలిపారు. శుక్రవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ చట్టం వలన సివిల్‌ కోర్టుకు భూ తగాదాలు రావని, దానిని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గడ్డి శ్రీనివాసులు, పరిటాల సురేష్‌, రవి, మనోహరమ్మ, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, దుర్గారావు, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

➡️