క్రీడలతో మానసిక ఉల్లాసం

ప్రజాశక్తి – మార్కాపురం రూరల్‌ : పట్టణ యోగ స్పోర్ట్స్‌ అండ్‌ క్లబ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భీమవరం వెంకటేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనాను ఆదివారం సన్మానించారు. నిత్యం వివిధ ప్రభుత్వ శాఖల కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడిపే రాహుల్‌ మీనా ఆటవిడుపులో భాగంగా డాక్టర్‌ వైయస్సార్‌ క్రీడా వికాస కేంద్రానికి వచ్చారు. కొద్దిసేపు సరదాగా షటిల్‌ అడారు. షటిల్‌ అడుతున్నంత సేపు సహచర ప్లేయర్స్‌తో కలివిడిగా మాట్లాడుతూ గడిపారు. మొదటి సారిగా క్రీడా ప్రాంగణానికి వచ్చిన సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా కు పట్టణ యోగ స్పోర్ట్స్‌ అండ్‌ క్లబ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భీమవరం వెంకటేశ్వర రెడ్డి సాదర స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాహుల్‌ మీనా మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న పోటీ ప్రపంచంలో యాంత్రిక జీవనం వైపు పరిగెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దైనందిన జీవితంలో క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయన్నారు. క్రీడలతో మానసిక ఒత్తిడికి దూరం కావచ్చునని తెలిపారు. మానసిక ప్రశాంతత, ఆరోగ్య వంతంగా జీవించవచ్చునని తెలిపారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామంతో పాటు క్రీడలకు కొంత సమయం కేటాయించాలన్నారు. ఈ సందర్భంగా పట్టణ యోగ స్పోర్ట్స్‌ అండ్‌ క్లబ్‌ అసోసియేషన్‌ కమిటీకి సబ్‌ కలెక్టర్‌ రాహూల్‌ మీనా కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ సహాయ కార్యదర్శి తిమ్మిశెట్టి సత్యం, పిన్నిక చక్రపాణి పాల్గొన్నారు.

➡️