క్రీడారంగంలోనూ కక్ష సాధింపు చర్యలు

Feb 27,2024 20:59

ప్రజాశక్తి-విజయనగరం కోట :  రాజకీయాల్లోనే కాదు చివరకు క్రీడారంగంలో కూడా వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేసి క్రీడాకారుల జీవితాలతో ఆడుకుం టోందని విజయనగరం నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పూసపాటి ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నగరంలోని 17 , 21వ డివిజన్లలో ఇంటింటి ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజలకు వివరించారు, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం – జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. క్రీడారంగం అభివృద్ధి కోసం ఇటీవల క్రీడలు నిర్వహించిన ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అని పేరు పెట్టి క్రీడాకారుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని అన్నారు. క్రికెట్‌ టీంలో 17 వ స్థానంలో వున్న వైసిపి నాయకుడి కుమారుడిని తెలుగు తేజం, టీం ఇండియా టెస్ట్‌ స్పెషలిష్ట్‌ హనుమ విహారి మందలించాడనే కారణంతో అతన్ని ఆంధ్రా రంజీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగేలా చేయడం బాధాకరమని అన్నారు జగన్‌ ప్రభుత్వం క్రీడాకారుల భవిష్యత్తుతో ఆడుకుంటోందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు కార్యదర్శి గంటా పోలినాయుడు, రాష్ట్ర బిసి సంఘం నాయకులు వేచలపు శ్రీనివాసరావు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, పట్టణ నాయకులు అవనాపు విజరు ,పిల్లా విజరు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️