క్షతగాత్రులకు పరామర్శ

Mar 26,2024 19:44
క్షతగాత్రులకు పరామర్శ

క్షతగాత్రులను పరామర్శిస్తున్న బుర్రా
క్షతగాత్రులకు పరామర్శ
ప్రజాశక్తి-కందుకూరు : కూలి పనులు నిమిత్తం మంగళవారం ఉదయం ఆటోలో మెపాడు వైపు వెళ్తున్న కందుకూరు పట్టణ శ్రీరామ నగర్‌ కాలనీ వాసులు ఆటోను వెనుక వైపు నుంచి వేగంగా వచ్చి పొగాకు చెక్కుల లోడ్‌తో కూడిన ట్రాక్టర్‌ ఢకొీట్టడంతో ఆటోలో ఉన్న పలువురు గాయపడ్డారు. వీరిని కందుకూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కి తరలించారు.ఈ విషయం తెలుసుకున్న వైసిపి అభ్యర్థి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ హుటాహుటిన ఏరియా వైద్యశాలకు చేరుకుని చికిత్స పొందుతున్న క్షతగాత్రులైన బూసి.లక్ష్మమ్మ, ఉమామహేశ్వరి లను పరామర్శించినారు. ఈ ప్రమాదంలో మరణించిన డాలు.లక్ష్మమ్మ మృతదేహాన్ని సంద ర్శించి నివాళి అర్పించారు. ఆమె భర్త హరిబాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధప డుతు డయాలసిస్‌ వైద్యం చేయించుకుంటున్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అందాల్సిన సాయం అందేవిధంగా చూస్తామని, బాధిత కుటుంబాలకు అండగా వుంటామని భరోసా కల్పించారు.

➡️