క్షమాపణ చెప్పకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ

Mar 19,2024 23:54

మాట్లాడుతున్న బొర్రా వెంకట అప్పారావు
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ :
జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంటేశ్వరావు తనకు భేషరతుగా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పకుంటే సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుండి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొర్రా వెంకట అప్పారావు అన్నారు. మండలంలోని ధూళిపాళ్లలో జనసేన నియోజవకర్గ విస్తృత సమావేశం సోమవారం రాత్రి నిర్వహించగా వెంకట అప్పారావు మాట్లాడుతూ తాను వైసిపి కోవర్టునంటూ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారని, ఏ ఆధారంతో అలా అన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్టీని వెంకటేశ్వరరావు నాశనం చేస్తున్నారని, ఆయన వచ్చాక జిల్లాలో గ్రూపులు ఏర్పడ్డాయని విమర్శించారు. టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు తనకు మధ్య ఆగాధం సృష్టిస్తున్నారని అన్నారు. మిత్రపక్షాలు తగిన గౌరవం దక్కడం లేదని జనసేన నాయకులను అవమాన పర్చడంతోపాటు కొందరికి టిడిపి కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. జనసేన డెవలప్మెంట్‌ ఫోరమ్‌ అధ్యక్షులు ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ టిడిపితో పోత్తు జనసేనను బలహీన పరుస్తుందన్నారు. జనసేనలో శిఘండులున్నారని, వారి వల్లే పార్టీ బలహీనమవుతోందని చెప్పారు. ఇదిలా ఉండగా వెంకట అప్పారావుకు జనసేన నాయకులు, కార్యకర్తలు మద్దతు ప్రకటించారు. ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారు. సమావేశంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సాంబశివరావు, కౌన్సిలర్‌ ఆర్‌.సుమన్‌, నాయకులు బి.కేశవ, మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️