ఖోఖోలో సత్తా చాటిన కొండాయపాలెం సచివాలయం జట్టు

ఈపూరు: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరుగుతున్న ఆడుదాం ఆంద్రా పోటీలలో మండ లంలోని కొండాయపాలెం సచివాలయం (బొగ్గరం) జట్టు ఖోఖో పోటీలలో జిల్లాస్థాయి లో ప్రథమ స్థానం సాధించినట్లు ఎంపీడీవో ఏవి రంగనాయకులు తెలిపారు. ఈ జట్టు ఈనెల 6, 7, 8 ,9 వ తేదీలలో విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటుందని చెప్పారు. వ్యాయావఉపాధ్యాయులు రూత్‌ మేరీ, ఎ.వీరాం జనేయులు, ఎం.వెంకటేశ్వర్లు, టి.పుల్లారావులు కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు.

➡️