గతుకుల మాయం పన్నెడా మెయిన్‌ రోడ్డు

ప్రజాశక్తి-పెదబయలు(అల్లూరి జిల్లా) : సీకారి పంచాయతీ పన్నెడా పంటపోలాల మధ్యలో గల మెయిన్‌ రోడ్డు పూర్తిగా గతుకులమయంగా మరి వాహనదారులకు పాదాచారులకు ప్రాణ శంకటంగా మారింది. మండల కేంద్రం నుండి పాడేరు వైపు వందలాది వాహనాలు ఈ రోడ్డు నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. రాజకీయ నాయకులకు, సంబంధిత అధికాలకు ఎన్నిమార్లు విన్నవించిన కనీస స్పందన కనబరచడంలేదని వాహనదారులు స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అరడకోట, చాకిరేవు గెడ్డ వంతెనపై పూర్తిగా ద్వంసమైంయింది. ఆర్‌అండ్‌బి అధికారులు కనీసస్పర్శ లేకపోవడంతో వాహానదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పయణిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మెయిన్‌ రోడ్డు గోతులు మరమ్మతులు చేపించాలని స్థానికులు కోరుతున్నారు.

➡️