గల్ఫ్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌లో డబుల్‌ హార్స్‌ ఉత్పత్తులు

గల్ఫ్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌లో డబుల్‌ హార్స్‌ ఉత్పత్తుల ప్రదర్శన

 దుబారు ట్రేడ్‌ సెంటర్‌లో ఈనెల 23 వరకూ ప్రదర్శన -వ్యాపార రంగంలో ప్రపంచస్థాయికి చేరిన డబుల్‌ హార్స్‌

ప్రజాశక్తి-తెనాలి : డబుల్‌హార్స్‌ మినపగుళ్ల వ్యాపార రంగంలో తెనాలి కీర్తి ప్రపంచ స్థాయికి చేరిందని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మునగాల శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెనాలి కేంద్రంగా ప్రారంభమైన సంస్థ దినదినాబివృద్ది చెంది, ఇరు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశ విదేశాలకూ విస్తరించిందన్నారు. వ్యాపార రంగంలో 20 ఏళ్ళుగా సుదీర్ఘ అనుభవం గడించిన పట్టణానికి చెందిన తెనాలి డబుల్‌ హార్స్‌ ఉత్పత్తులు దుబారు ట్రేడ్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న గల్ఫ్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌లో విశేష ఆదరణ పొందాయని తెలిపారు. తెనాలి డబుల్‌ హార్స్‌ సంస్థ వ్యాపార రంగంతో పాటు ఆహార ఉత్పత్తులో అగ్రగామిగా ఉందని, ఆహార ఉత్పత్తులను పెందదని, ప్రపంచంలోని పలు దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. దేశ విదేశాలకు తెలుగువారి రుచులను చాటుతోందన్నారు. ఈనెల 19 నుంచి దుబారు ట్రేడ్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న 22వ గల్ఫ్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌లో తెనాలి డబుల్‌ హార్స్‌ సంస్థ ఆహార ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌లో పలు దేశాలకు చెందిన సంస్థలు తమ ఆహార ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. వారిలో తెనాలి డబుల్‌ హార్స్‌ సంస్థ పాల్గొనటం తమ సంస్థకు గర్వకారణమన్నారు. 50 రకాల ఉత్పత్తులను ప్రదర్శనగా ఉంచిందని,. పప్పులు, ఇన్‌స్టెంట్‌ పొడులు, స్వీట్స్‌, రెడీ టు కుక్‌, రెడీ టు ఈట్‌ (మీల్స్‌), చిక్లెట్స్‌, స్పైసెస్‌, పికిల్స్‌, మిల్లెట్స్‌ వంటివి ప్రదర్శనలో ఉంచారు. దాదాపు 127 దేశాలకు చెందిన ఆహార ప్రియులు ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌ను వీక్షిస్తున్నారు. ఫుడ్‌ ఫెస్టివల్‌ ఆహార ప్రియుల భవిష్యత్‌ అవసరాలను అర్ధం చేసుకునేందుకు, వారి డిమాండ్‌కు తగినట్టుగా వ్యాపార విస్తరణకు ఎంతగానో ఉపయోగ పడుతుందని సంస్థ ఎండి మునగాల శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు. ఈ ప్రదర్శన ద్వారా తమ సంస్థ ఉత్పత్తులు వివిద దేశాల ప్రతినిధులకు, ప్రతినిధులకు చేరువయ్యాయని, అవి వారిని విశేషంగా ఆకర్షించాయని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో ప్రజల అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని విస్తరింప చేస్తామన్నారు.

➡️