గిరిజనులను షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలి

Jan 2,2024 21:37

ప్రజాశక్తి- మెంటాడ : గిరిజనులను షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలని సిపిఎం మండల కార్యదర్శి రాకోటి రాములు డిమాండ్‌ చేశారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో మంగళవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అటవీ భూముల్లో గిరిజనులు సాగుచేస్తున్న భూములకు పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. గిరిజన సమస్యలపై కొండలింగాలవలస, ఆండ్ర, జయతి, గుర్ల, జిటిపేట, లోతుగెడ్డ పంచాయితీలలో మధుర గ్రామాల గిరిజనులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం పలు సమస్యలపై తహశీల్దార్‌ రామకృష్ణకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కొండలింగాలవలస సర్పంచ్‌ పాడి వరహాలమ్మ, గిరిజన సంఘం మండల కార్యదర్శి తామారాపల్లి సోములు, పలు గ్రామాల పార్టీ నేతలు, గేదెల పెదరాం, ఏలుసూరి ప్రకాశ్‌, అగతాన గణేష్‌, సిడగం సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

➡️