గెలిచాడు..ప్యాలెస్‌లో కూర్చున్నాడు..

Jan 29,2024 21:26
మాట్లాడుతున్న మాజీమంత్రి నారాయణ

మాట్లాడుతున్న మాజీమంత్రి నారాయణ
గెలిచాడు..ప్యాలెస్‌లో కూర్చున్నాడు..
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ: వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు మాయ మాటలు చెప్పి గెలిచారని.. గెలిచిన తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తూ.. అభివద్ధిని మరిచి ప్యాలెస్‌లోనే కూర్చున్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. బాబుష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా.. నెల్లూరు నగరం 46,7 డివిజన్లలో ఏసీ సెంటర్‌, జాపర్‌ సాహెబ్‌ తదితర ప్రాంతాల్లో స్థానిక టీడీపీ నాయకులతో కలిసి సోమవారం ఆయన పర్యటించారు. ముందుగా… నారాయణకి డివిజన్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూల వర్షం కురిపిస్తూ…ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా డివిజన్లలోని ప్రతీ షాపుకెళ్లి… తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివద్ధిని తెలియజేస్తూ… ఈ ఐదేళ్ల అరాచక పాలనలో చేసిన దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలను ప్రజలకి వివరించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రజల్ని అభ్యర్థించారు. ఇందుకు ప్రజలు…ఈ సారి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేని చెబుతుండడంతో నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మేము వెళ్లి…ఓటు అడగక ముందే…సార్‌… ఈసారి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ప్రజలే మాకు కొండంత భరోసా ఇస్తుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏ డివిజన్‌కెళ్లినా… ప్రజలు, వ్యాపారస్తుల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు.ఇందుకు కారణం…జగన్మోహన్‌రెడ్డి చేస్తోన్న అరాచక పాలనేనన్నారు. నాయకుడంటే….ఒక ప్యాలెస్‌లోనో…ఒక రూమ్‌లోనో కూర్చొని పరిపాలించడం కాదని… సిఎం జగన్‌కి చురకలటించారు. నాయకుడు అనే వాడు ప్రజల మధ్య తిరగాలన్నారు. ఆయన అధికారం కోసం తిరిగాడని…అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మరచిపోయి…ప్యాలెస్‌కే పరిమితమై పోయాడని విమర్శించారు. ఎవరో నలుగురు ఇచ్చే సలహాలతో… అరాచక పాలన సాగిస్తూ… ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే జగన్‌కి తెలిసిందన్నారు. టీడీపీ హయాంలో… ఒక్క రూపాయి కూడా పన్నులు పెంచలేదని…ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలపై భారాలు భారాలు మోపుతూనే ఉందన్నారు. అసలు ఏ రాష్ట్రంలో కూడా చెత్తకి పన్ను లేదని…కానీ మన రాష్ట్రంలో చెత్తకి కూడా పన్ను వేసే ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నానని ఎద్దేవా చేశారు. ఇలా…నిరుపేదలపై అనేక భారాలు మోపిన ఘనత జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. నాయకుడనే వాడు..ప్రజల క్షేమాన్ని కోరుకోవాలని తెలిపారు. కేవలం జగన్మోహన్‌రెడ్డికి అనుభవం లేకనే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని మండిపడ్డారు. ఇదే విధంగా కొనసాగితే…మన పిల్లల భవిష్యత్‌ శూన్యమన్నారు. చివరికి మన రాష్ట్రం మరో శ్రీలంక అయి పోతుందన్నారు. పరిశ్రమలు వస్తేనే…రాష్ట్రం కానీ…సిటీ కానీ…గ్రామం కానీ…డెవలప్‌ మెంట్‌ అవుతాయన్నారు. చైనా, జపాన్‌ ఇలా తదితర దేశాలు…పరిశ్రమల వల్లే…ఎంతో అభివద్ధి చెందాయన్నారు. ఈ ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన చేసిన దాఖలాలే లేవన్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని… ప్రజలకి సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు షేక్‌ కరిముల్లా, మాజీ జెడ్‌పిటిసి విజేత రెడ్డి, టీడీపీ నేత రంగ మయూర్‌ రెడ్డి, 46వ డివిజన్‌ అధ్యక్షుడు కోకు మహేందర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దశరథ రామిరెడ్డి, యూనిట్‌ ఇన్‌ఛార్జ్‌ మణికుమార్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️