గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు

Jan 20,2024 23:56
చేస్తున్నట్లు కలెక్టర్‌ కృతికా

ప్రజాశక్తి – కాకినాడ

కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ఉన్న ఇవిఎం, వివి ప్యాట్‌ గోదాముకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ కృతికా శుక్లా తెలి పారు. శనివారం రెవెన్యూ, ఎన్నికలు, అగ్ని మాపక శాఖల అధికారులతో కలిసి ఇవిఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడు తున్న ఏర్పా ట్లను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లా డుతూ ఇవిఎంల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఎన్నికలు, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గ నిర్దేశాల మేరకు ప్రతి నెల ఇవిఎం, వివి ప్యాట్‌ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, సమగ్ర నివేది కను పంపిస్తున్నట్లు వెల్లడించారు. అనం తరం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లాకు చెందిన ఎపిక్‌ కార్డులు పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఎన్ని క అధికారులు ఎపిక్‌ కార్డులు పంపిణీ ప్రక్రి యపై ప్రత్యేక దృష్టి పెట్టి సకాలంలో నూరుశాతం కార్డుల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఎన్నికల డిప్యూ టీ తహశీల్దార్‌ ఎం.జగన్నాథం పాల్గొన్నారు.

➡️