ఘనంగా టైలర్ల దినోత్సవం

టైలర్ల దినోత్సవం

ప్రజాశక్తి -తగరపువలస : టైలర్ల దినోత్సవం సందర్భంగా కుట్టు మిషన్‌ సృష్టికర్త విలియం ఎలియస్‌ హూవే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిట్టివలస ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ నుంచి పట్టణ పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. చిట్టివలస జ్యూట్‌ మిల్లు కల్యాణ మండపం సభ నిర్వహించారు. అఖిల భారత పద్మశాలి సంఘం కార్యదర్శి, మాజీ కౌన్సిలర్‌ కొప్పల రమేష్‌, పిఎసిఎల్‌ అధ్యక్షులు అక్కరమాని రామునాయుడు, టిడిపి నేత టి సూరిబాబు మాట్లాడుతూ, టైలర్లందరూ ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టైలర్లు జోగ అప్పారావు, మాదాబత్తుల సాధూరావు, చింతల వెంకటరావు, ఎల్లమాంబ టైలర్ల సంక్షేమ సేవా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పెంటపల్లి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి చింతల సురేష్‌, భ్యులు పాల్గొన్నారు

తగరపువలసలో ర్యాలీ నిర్వహిస్తున్న టైలర్లు

➡️