చల్లని గాలులు.. చిరుజల్లులు

Dec 4,2023 20:44

  ప్రజాశక్తి-బొబ్బిలి రూరల్‌  :  తుపాను ప్రభావంతో బొబ్బిలిలో చల్లని గాలులు వీచాయి. చిరుజల్లులు కురిశాయి. చల్లని గాలులతో చలి తీవ్రత పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు పొలాల్లో ఉన్న వరిచేలను కాపాడుకునేందుకు రైతులంతా అప్రమత్తమయ్యారు. కోసి ఉంచిన వరిచేలను దిబ్బలుగా పెట్టి టార్పిలిన్లు కప్పారు. లక్కవరపుకోటలో తేలికపాటి వర్షంలక్కవరపుకోట : మండలంలో సోమవారం ఉదయం నుంచి తేలికపాటి వర్షం కురిసింది. పండిన పంట చేతికి వచ్చే సమయంలో తుపాను కారణంగా కురుస్తున్న వర్షం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కోసిన వరిచేనును సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మండల వ్యవసాయశాఖ అధికారి స్వాతి రైతులకు సూచించారు. భారీవర్షాల నేపథ్యంలో మండలంలో పాఠశాలలకు సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం వరకు సెలవు ప్రకటించినట్లు ఎంఇఒ సిహెచ్‌.కూర్మారావు తెలిపారు.రైతులు అప్రమత్తంవంగర : మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో మండలంలో సోమవారం ఉదయం నుంచి తేలికపాటి వర్షపు జల్లులు కురిసాయి. వివిధ గ్రామాలలో ఇప్పటికే వరి చేలు కోతలు కోసిన రైతులు తమ పంటలు తుపాను ముప్పుతో పాడైపోతాయేమోనని అప్రమత్తమయ్యారు. వరి చేను కాపాడుకునేందుకు రైతులు టార్పెయిన్‌లను కుప్పలపై కప్పుతున్నారు. ఈ తుపాను మంగళవారానికి ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది.

➡️