చురుగ్గా రైల్వే అండర్‌ పాత్‌వే పనులు

రైల్వే అండర్‌పాత్‌వే

ప్రజాశక్తి -గోపాలపట్నం: జివిఎంసి 89వ వార్డు చంద్రనగర్‌ సమీపంలో, సింహాచలం రైల్వేస్టేషన్‌ వెనుక భాగంలో రైల్వే అండర్‌పాత్‌వే పనులు చురుగ్గా సాగుతున్నాయి. శనివారం ఆయా పనులను స్థానిక ఎమ్మెల్యే పి.గణబాబు పరిశీలించి, దగ్గరుండి పర్యవేక్షించారు. వారం రోజుల నుండి భారీ క్రేనుల సాయంతో రైల్వే ట్రాక్‌ను కట్‌ చేసి, కాంక్రీట్‌ బాక్సులను అండర్‌ గ్రౌండ్‌లో అమర్చడం ద్వారా రైల్వేస్టేషన్‌ వెనుకభాగంలో ఉన్న ప్రాంతాలకు బస్సులు, అంబులెన్స్‌లు వంటి వాహనాల రాకపోకలకు వీలుగా అండర్‌పాత్‌వే నిర్మిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పి.గణబాబు, బిజెపి నేతల కృషితో రైల్వే అండర్‌పాత్‌వే పనులకు కేంద్రం కోట్లాది రుపాయలను కేటాయించింది. నిర్మాణంపూర్తయి రైల్వేఅండర్‌ పాత్‌వే వినియోగంలోకి వస్తే రైల్వేస్టేషన్‌దిగువ ప్రాంతవాసులకు రవాణా కష్టాలు తీరినట్లే.

పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గణబాబు

➡️