చెకుముకి విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం

Dec 21,2023 19:12
సర్టిఫికెట్లు పంపిణీ చేస్తున్న దశ్యం

సర్టిఫికెట్లు పంపిణీ చేస్తున్న దశ్యం
చెకుముకి విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం
ప్రజాశక్తి- తోటపల్లిగూడూరు : జనవిజ్ఞాన వేదిక మండల స్థాయిలో తోటపల్లి గూడూరు జిల్లా పరిషత్‌ హై స్కూల్ల్లో గురువారం చెకుముకి టాలెంట్‌ పరీక్ష నిర్వహించింది. మండల విద్యాశాఖ అధికారి జయరాం నాయుడు పర్యవేక్షణలో ఈ పరీక్ష జరిగింది. చెకు ముకి ప్రతిభా పరీక్షలో ప్రథమ స్థానంలో వరిగొండ జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు, ద్వితీయ స్థానంలో తోటపల్లిగూడూరు హైస్కూల్‌ విద్యార్థులు, తతీయ స్థానంలో చెన్నపల్లిపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిలిచారు. వీరికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సర్టిఫికెట్లు అంద జేశారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఎన్‌.పి. సి ఉదయ భాస్కరరావు, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఫణి కుమార్‌, జి శ్రీనివాసులు రెడ్డి, అన్నం వెంకటేశ్వర్లు ఉన్నారు.

➡️