చెవిలో పూలు పెట్టారు

Dec 23,2023 21:34

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : మాటతప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను మరిచిపోయి అంగన్వాడీలో చెవిలో పూలు పెట్టారని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి వై.మన్మథరావు, కోశాధికారి గొర్లి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 12వ రోజుకు చేరింది. పార్వతీపురంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు మర్రాపు అలివేలు, సాలూరు గౌరీమణి ఆధ్వర్యంలో సమ్మె శిబిరం కొనసాగించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వినూత్నరీతిలో అంగన్వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూలు, విన్నపాలు సమర్పించి నిరసన తెలిపారు. అంగన్వాడీల నిరసనకు మన్మథరావు, వెంకటరమణ మద్దతు తెలిపి, మాట్లాడారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్లను నెరవేర్చే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టంచేశారు. అంగన్వాడీలకు కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ జెఎసి రాష్ట్ర అధ్యక్షులు కాంతారావు, సిఐటియు నాయకులు బొత్స లక్ష్మి, బంకురు సూరిబాబు, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు, ఉత్తరాంధ్ర పార్టీ నాయకులు మెట్టు రామారావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సెక్టార్‌ లీడర్స్‌ టి.రాజేశ్వరి, బి.నీలవేణి, పార్వతి, ధర్మావతి, కె.రాజేశ్వరి, ఎం.గౌరీ, బి.శాంతి, బి.సునీత, కల్పన, జయలక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు.సీతంపేట : సీతంపేట ఐటిడిఎ కార్యాలయం ఎదుట నిర్వహించిన అంగన్వాడీల సమ్మె శనివారానికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు చెవుల్లో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శి ఎస్‌.సురేష్‌, ఎం.కాంతారావు, అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు, ఎ.పార్వతి, ఎ.దర్శిమి, సహాధ్యక్షులు అంజలి, గిరిజన సంఘం నాయకులు సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.సీతానగరం : మండల కేంద్రంలో అంగన్వాడీ ధర్నా శిబిరాన్ని యుటిఎఫ్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పల్లి శ్రీనివాసరావు, బొత్స ప్రసాదరావు, గౌరవాధ్యక్షులు తీళ్ల మధుసూదనరావు, నాయకులు అంది పోలినాయుడు, బూరాడ ఆదినారాయణ సందర్శించి, సంఘీభావం ప్రకటించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి వై.శాంతి కుమారి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గవర వెంకటరమణ, అంగన్వాడి యూనియన్‌ నాయకులు మరడ సత్యవతి, పి.యశోద, వంగపండు లక్ష్మి, కె.శైలజ, మరిచర్ల సునీత పాల్గొన్నారు.సాలూరు : 12రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీ యూనియన్‌ పట్టణ అధ్యక్షులు బి.రాధ, మండల అధ్యక్షులు ఎ.నారాయణమ్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు ఆధ్వర్యాన రిలే దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శ్యామల, వరలక్ష్మి, తిరుపతమ్మ, పార్వతి, శశికళ పాల్గొన్నారు.కొమరాడ : 12వ రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీలు కొమరాడలో నిరసన దీక్ష చేపట్టారు. అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ సెక్టార్‌ లీడర్లు బి.అలివేలు, జ్యోతి, మల్లేశ్వరమ్మ, పద్మ, లలిత, మాధవి, జయమ్మ, సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి, తెలుగు రైతు నాయకులు బత్తిలి శ్రీనివాసరావు పాల్గొన్నారు.పాలకొండ : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో చెవిలో పూలు పెట్టుకుని అంగన్వాడీలు నిరసన చేపట్టారు. వీరికి సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, అభ్యదయ రైతు ఖండపు ప్రసాదరావు మద్దతు తెలిపారు. అంగన్వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌. హిమప్రభ, పాలకొండ ప్రాజెక్టు అధ్యక్షులు జి.జెస్సీ బారు, బి.అచ్చమ్మ, బి.జ్యోతి, కె.సీతమ్మ, ఎన్‌.ప్రమీల, కె.పావని, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దూసి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వం స్పందించకపోవడం దారుణంసిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణుప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురంఅంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 12 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. శనివారం గుమ్మలక్ష్మీపురంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల పోరాటానికి సిపిఎం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే అంగన్వాడీలతో కలిసి ఐక్యంగా పోరాడుతామని హెచ్చరించారు. ప్రజానాట్య మండలి జిల్లా కన్వీనర్‌ కోరాడ ఈశ్వరరావు పాట పాడుతూ అంగన్వాడీలను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు సత్యవతి, కస్తూరి పాల్గొన్నారు.

➡️