జనసేనలోకి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

Feb 22,2024 15:37 #Narasapuram

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): జనసేనలో చేరుతానని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. గురువారం ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్వప్రయోజనాల ఆశించకుండా రాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే, పవన్‌ కళ్యాణ్‌ ఆశయాలు నచ్చడంతో జనసేన లో చేరుతానని చెప్పారు. గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి యువతకు ఆరాధ్య నాయకుడని అన్నారు. ఆయన సొంత సొమ్ము వెచ్చించి కౌలు రైతులకుఆర్ధిక సహాయం అందిచరన్నారు.రాజధాని అమరావతి విషయంలో ఆయన పోరాటం ఎనలేనిదన్నారు. రైల్వే జోన్‌, ప్రత్యేక హౌదా కోసం నిర్మొహమాటంగా పోరాటం చేశారన్నారు.

➡️