జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

ప్రజాశక్తి-ముండ్లమూరు: జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం అభినందనీయమని జనసేన దర్శి నియోజకవర్గ నాయకులు గరికపాటి వెంకట్‌ అన్నారు. ఆదివారం మండలంలోని వేంపాడు, ఈదర, దర్శి మండలం తూర్పువీరాయపాలెం గ్రామంలో గరికపాటి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేంపాడులో మొదటి బహుమతి కావూరి సుస్మిత, రెండో బహుమతి బోడపాటి లక్ష్మీపూజ, మూడో బహుమతి కొప్పునేని వెంకట శ్రావణి గెలుచుకున్నారు. వీరికి బహుమతులను గరికపాటితో పాటు మేదరమెట్ల వీరయ్య చౌదరి, తాళ్లూరి నారాయణస్వామి అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

➡️