‘జయహో బీసీ’ ప్రచార రథాలు ప్రారంభం

నరసరావుపేటలో ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్న జీవీ ఆంజనేయులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా ప్రాధాన్యమిచ్చింది టిడిపియేనని ఆ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని టిడిపి జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జయహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తామని, 40 రోజులపాటు జరిగే కార్యక్రమంలో… వైసిపి ప్రభుత్వం హయాలో బీసీలపై జరుగుతున్న అరాచకాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బీసీలకు వైసిపి తీరని అన్యాయం చేసిందని, రూ.75 వేల కోట్ల బిసి సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లించారని, బీసీలకు రావాల్సిన 30 పథకాలను నిలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ పల్నాడులో బీసీలపై వైసిపి నేతలు అనేక దొంగ కేసులు పెట్టారన్నారని, రాబోయే ఎన్నికల్లో వైసిపికి బీసీలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైసిపి పాలనలో బీసీలపై జరిగిన దాడులను పేర్కొంటూ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ‘జయహో బీసీ’ ప్రచార రథాలను ప్రారంభించారు. కార్యక్రమంలో టిడిపి జాతీయ క్రమశిక్షణ కమిటీ మెంబర్‌ జి.నాగేశ్వరరావు, డాక్టర్స్‌ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ కడియాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర రజక సాధికార సమితి కన్వీనర్‌ జి.రామకృష్ణ, రాష్ట్ర భట్రాజుల సాధికార సమితి కన్వీనర్‌ ప్రసన్నాంజనేయ రాజు, జిల్లా బిసి సెల్‌ అధ్యక్షులు ఎం.రాంబాబు, ఉపాధ్యక్షులు సాంబశివరావు, నియోజకవర్గ అధ్యక్షులు టి.నరసింహారావు, నాయకులు కడియం కోటి సుబ్బారావు. పాల్గొన్నారు.
ప్రజాశక్తి – చిలకలూరిపేట : టిడిపి-జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటును బీసీలంతా కోరుకుంటున్నారని మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థానిక పండరీపురంలోని తన నివాసం వద్ద జయహో బీసీ ప్రచార రథాన్ని జనసేన నాయకులు టి.రాజారమేష్‌తో కలిసి పుల్లారావు మంగళవారం ప్రారంభించారు. ఈ నాలుగున్నరేళ్ల వైసిపి పాలనలో బీసీలను అణగదొగ్కారని, ఇప్పుడు బీసీ సాధికార యాత్రపేరుతో మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఎస్సీలకున్న 27 రకాల సంక్షేమ పథకాల రద్దు, బీసీల రిజర్వేషన్ల తగ్గింపుపై జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన శ్రేణులు పాల్గొన్నాయి.నేడు డయల్‌ యువర్‌ డిఎంప్రజాశక్తి – వినుకొండప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఆర్‌టిసి డిపోలో బుధవారం డయల్‌ యువర్‌ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్‌ మంగళవారం తెలిపారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయాణికులు 9959225431 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలు, సలహాలు చెప్పొచ్చని పేర్కొన్నారు.

➡️