జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న జర్నలిస్టులు

Feb 19,2024 18:02

దాడులకు నిరసనగా జర్నలిస్టుల మానవహారం
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి కెమెరామెన్‌పై జరిగిన దాడిని చిలకలూరిపేట ప్రెస్‌క్లబ్‌, ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఖండించారు. ఈ మేరకు స్థానిక ఎన్‌ఆర్‌టి సెంటర్‌లో జాతీయ రహదారిపై సోమవారం మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లి సీనియర్‌ అసిస్టెంట్‌కు వినతి పత్రం ఇచ్చారు. నయకులు పి.భక్తవత్సలరావు, మస్తాన్‌వలి మాట్లాడుతూ కెమెరామెన్‌పై దాడి ప్రభుత్వ పిరికిపంద చర్యన్నారు. వైసిపి పాలనలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని దీనిపై సిఎం సత్వరమే స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అమరావతి ఈనాడు విలేఖరిపై దాడి చేసిన వారిపైనా కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎ.శేషగిరిరావు, అబ్దుల్‌ సత్తార్‌, అల్లాబక్షు, ఎం.కోటేశ్వరరావు, ఎన్‌.బాబ్జీరావ్‌, నారాయణస్వామి, పి.వెంకట్రావు, షేక్‌ ఫక్రుద్దీన్‌, ఎ.ఆంజనేయులు పాల్గొన్నారు.

➡️