జాతీయ స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థిని భ్యూలా

విజయపురిసౌత్‌: స్థానిక డాక్టర్‌ బిఆర్‌అంబేద్కర్‌ గురుకుల కళాశాల విద్యార్థిని భ్యూలా అండర్‌-19 రాష్ట్ర స్థాయి రోప్‌ స్కిప్పింగ్‌ పోటీల్లో గెలుపొంది బంగారు పతకం సాధిం చినట్లు ప్రిన్సిపాల్‌ మేరిమంజుల బుధవారం తెలిపారు. గత నెల 28 నుంచి 30 వరకు భీమవరం డీఎన్‌ఆర్‌ కళాశాలలో జరిగిన ఈ పోటీల్లో ఆమె ఈ పతకం సాధించిందని అన్నారు. భ్యూలా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. గోల్డ్‌ మెడల్‌ సాధించిన భ్యూలాను, బ్రాంజ్‌ మెడల్‌ సాధించిన ఎన్‌. అనిత, సర్టిఫికెట్లను సాధించిన విద్యార్థినులను, ప్రిన్సి పాల్‌ మేరిమంజుల,పీడీ మహబూబి,పీఈటీ నసీమ, ఉపాధ్యాయినులు అభినందించారు.

➡️