జిఒ. నెం.512ను తక్షణం రద్దు చేయాలి

Dec 14,2023 22:01
నినాదాలు చేస్తున్న లాయర్లు

నినాదాలు చేస్తున్న లాయర్లు
జిఒ. నెం.512ను తక్షణం రద్దు చేయాలి ప్రజాశక్తి- కావలి:భూ యాజమాన్య హక్కును పోగొట్టే విధంగా ఉన్న జిఒ. నెం.512 ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రద్దు చేయాలని కోరుతూ కావలి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం కావలిలో కోర్టు లను బహిష్కరించారు. అనంతరం న్యాయవాదులు మాట్లాడుతూ రైతుల యాజమాన్యంలో ఉండే భూములలో కౌలు రైతులకు హక్కు కల్పించే విధంగా ఉన్న జి.ఒ. నెం.512 రైతులకు హానికరమైనదన్నారు. వెంటనే ఈ జిఒను రద్దు చేయాలనీ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు జి.రాజేంద్ర వరప్రసాద్‌, అద్దేపల్లి శేషప్రసాద్‌, ఐ. సాయిప్రసాద్‌, వి. వెంకటరమణయ్య, ఎం. జయప్రకాశ్‌, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.

➡️