జెఎఎస్‌తో మెరుగైన వైద్యం: ఎమ్మెల్యే

Jan 30,2024 20:17

ప్రజాశక్తి – బొబ్బిలిరూరల్‌ : జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నాంది పలికారని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. మంగళవారం మండలంలోని కలవరాయి గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష -2 శిబిరాన్ని ఆయన సందర్శించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన రోగులతో ఆయన మాట్లాడి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. శిబిరం వద్దకు వచ్చే ప్రజలకు వైద్య సిబ్బంది అంది ంచే సేవలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బొత్స నటరాజ్‌, ఎంపిటిసి పాటూరి సింహాచలం, మాజీ సర్పంచ్‌ బొత్స విశ్వనాథం, వైసిపి నాయకులు, వైద్య సిబ్బంది, పాల్గొన్నారు.డెంకాడ: గ్రామాల్లో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్‌) శిబిరాలతో ఆరోగ్యంగా ఉండవచ్చునని డిఎంహెచ్‌ఒ భాస్కరరావు అన్నారు. మంగళవారం గుణుపూరుపేటలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పేషంట్‌ రిజిస్ట్రేషన్‌ జరుగు విధానం, లాబ్‌ టెస్ట్స్‌, ఫార్మసీ, కంటి వైద్య శిబరాలను సందర్శించారు. ఈ శిభిరంలో అందుతున్న వైద్యసేవలు గురించి డెంకాడ పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ బి. భవానీని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు స్పెషలిస్ట్‌ డాక్టర్స్‌ మౌనిక, వెంకట భాస్కర్‌ రోగులకు వైద్య సేవలు అందించారు. కంటి పరీక్షలను డాక్టర్‌ మజ్జి గణపతిరావు తనిఖీ చేశారు. బీపీ, షుగర్‌ ఇతర వ్యాధులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, డెంకాడ పిహెచ్‌సి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.మెంటాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికీ ఆరోగ్యం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రజల ముంగిటకు వైద్య సేవలు అందిస్తున్నారని ఎంపిపి రెడ్డి సన్యాసినాయుడు అన్నారు. మండలంలోని మీసాల పేటలో సర్పంచ్‌ మహంతి రామునాయుడు అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి సారికి ఈశ్వరరావు, వైసిపి మండల అధ్యక్షులు రాయపల్లి రామారావు, నాయకులు రత్నాకర్‌ నాయుడు, ఎంపిడిఒ త్రివిక్రమ రావు, వైద్యాధికారులు షేక్‌ జిలాన్‌ భాష, నవీన్‌ కిరణ్‌ మూర్తి, సి హెచ్‌ఒ శ్రీనివాసరావు, ఎంఎల్‌హెచ్‌పి బి పావని, రాబంద సర్పంచ్‌ కూనిశెట్టి తవుడు, గ్రామ కార్యదర్శి సత్యనారాయణ, సచివాలయ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️