టిడిపితోనే బిసిలకు న్యాయం : శత్రుచర్ల

Feb 2,2024 21:14

ప్రజాశక్తి – కొమరాడ : టిడిపితోనే బిసిలకు న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ అన్నారు. మండలంలో జంఝావతి కూడలిలో మండల టిడిపి అధ్యక్షులు ఎస్‌. శేఖర్‌ పాత్రుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన జయహో బిసి కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి అంటేనే బీసీలకు ఆదరణ, బిసిల పార్టీగా గుర్తింపు పొందిందని అన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిసిలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బిసిలకు ఉన్న సబ్సిడీ రుణాలు, కార్పొరేషన్లు పూర్తిగా నాశనం చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. కురుపాం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి తోయక జగదీశ్వరి, రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌ మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలను నట్టేట ముంచిన ఘనత జగన్మోహన్రెడ్డిదేనని, కావున రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు డి.రామకృష్ణ, డి.వెంకటనాయుడు, జి.సుదర్శనరావు, ఎన్‌.మధుసూదనరావు, గంగరేగు వలస ఎంపిటిసి గంట వెంకటనాయుడు, గుణానుపురం ఎంపిటిసి ఎ.సంతోషి, నాయకులు మర్రాపు పురుషోత్తం, కృష్ణబాబు, పి.వెంకటనాయుడు, జనసేన నాయకులు కె.మల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️