టిడిపిలో చేరికలు

Mar 25,2024 21:49
ఫొటో : మాట్లాడుతున్న కావ్యక్రిష్ణారెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న కావ్యక్రిష్ణారెడ్డి
టిడిపిలో చేరికలు
ప్రజాశక్తి-కావలి : టిడిపి కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్‌ అధ్యక్షతన 32వ వార్డు ఇన్‌ఛార్జి పల్లపు కుమార్‌ సమక్షంలో దివంగత మాజీ కౌన్సిలర్‌ మల్లి ఆంజనేయులు కుమారుడు మల్లి ప్రసాద్‌ ఆధ్వర్యంలో సోమవారం వారి కుటుంబ సభ్యులు, అనుచరులు పెద్ద ఎత్తున వైసిపి నుండి టిడిపిలో చేరారు. బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పసుపులేటి అనుచరులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంజి ఏడుకొంలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి అనుచరులు, కుటుంబ సభ్యులు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. షేక్‌ హుస్సేన్‌, షేక్‌ రషీద్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులు వైసిపిని వీడి టిడిపిలో చేరారు. కావలి పట్టణంలోని 32వ వార్డులో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో టిడిపి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి పార్టీ కండువా కప్పి అందరిని తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి మలిశెట్టి వెంకటేశ్వర్లు, కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబూరావు, మాజీ కౌన్సిలర్‌ కమర్‌ బాబు, పట్టణ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ రహీం, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️