టిడిపిలో చేరిక

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : యర్రగొండపాలెం పట్టణానికి చెందిన యక్కలి మంత్రయ్య, కుమారులు వెంకట నారాయణ, సత్యనారాయణ, మణికంఠలు శుక్రవారం టిడిపిలో చేరారు. టిడిపి నియోజక వర్గ ఇన్‌ఛాగూడూరి ఎరిక్షన్‌ బాబు వారికి కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గోళ్ళ వెంకట సుబ్బారావు, కొత్తమాసు సుబ్రహ్మణ్యం, పెరుమళ్ళ మల్లికార్జున, అనుమాలశెట్టి సుబ్బారావు, చిట్యాల వెంగల్‌ రెడ్డి, పమిడిమర్రి కిషోర్‌, యక్కలి తిమ్మయ్య, తోట మహేష్‌ నాయుడు, కామేపల్లి వెంకటేశ్వర్లు, మూడో వార్డు నెంబర్‌ చేదురి కిషోర్‌, మల్లిపెద్ది రామకష్ణ, కిషోర్‌ సింగ్‌, అజారుద్దీన్‌ పాల్గొన్నారు. గిద్దలూరు : రాచర్ల మండలం జేపి చెరువు గ్రామ ఎంపిటిసి జెట్టి వెంకటేశ్వర్లు, విద్యాకమిటీ చైర్మన్‌ బూరుగుల ఖాసీంవలి, సచివాలయ కన్వీనర్‌ సిద్ధం నరసింహులు, వార్డు మెంబర్‌ షేక్‌ బాషా, కన్నెసాని గోపాల్‌, పుట్టా గురుమూర్తి వారి అనుచరులు శుక్రవారం వైసిపిలో చేరారు. అశోక్‌ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు కటికే యోగానంద్‌, జేపి చెరువు టిడిపి నాయకులు షేక్‌ మహమ్మద్‌ ఖాసీం, బొల్లవరం ఆదినారాయణ, వేల్పుల రాజీశ్వరరావు, షేక్‌ సుభాని తదితరులు పాల్గొన్నారు.

➡️