టిడిపిలో లుకలుకలు!

టిడిపిలో లుకలుకలు పతాకస్థాయికి చేరుకున్నాయి. జిల్లాలోని కడప ఎంపీ స్థానం మినహా మిగిలిన ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో గ్రూపుల పోరు నడుస్తోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలోని టిడిపి నాయకులు మూడు, నాలుగు గ్రూపులుగా చొప్పున విడిపోయి ఎవరికి వారే యమునా తీరు అన్న సామెత చందంగా మునిగిపోయే నావలా మార్చేశారు. టిడిపి నాయకత్వ విభజన అధికార వైసిపికి కలిసి రావడం 15 ఏళ్లుగా పరిపాటిగా మారడం తెలిసిందే. ఇటువంటి పరిస్థితులు జిల్లా కేడర్‌ను గందరగోళంలోకి నెట్టింది. కీ.శే మాజీమంత్రి బిజీవేముల వీరారెడ్డి మరణానంతరం కడప జిల్లాలో టిడిపికి సమర్థమైన నాయకత్వం కొరవడింది. ఫలితంగా టిడిపి బలం క్రమేణా గల్లంతైనడం సబబుగా ఉంటోందని చెప్ప వచ్చు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జిల్లాలోని కమలాపురంలో రా..కదలిరా పేరుతో టిడిపి అద్యక్షులు చంద్రబాబు శుక్రవారం పర్యటన నేపథ్యంలో కథనం..ప్రజాశక్తి – కడప ప్రతినిధికడప టిడిపిలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిడిపి అధిష్టానం చోద్యం చూస్తుండడం కేడర్‌లో గందరగోళం నెలకొంది. టిడిపి కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జి నియామకం, టికెట్‌ కేటాయింపుల వ్యవహారంలో ఆర్‌.మాధవిరెడ్డి వర్సెస్‌ లకీëరెడ్డి, అమీర్‌బాబు మధ్య ట్రయాంగిల్‌ ఫైట్‌ నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో టిడిపి అధ్యక్షులు చంద్రబాబు అసెంబ్లీ మాజీ ఇన్‌ఛార్జి అమీర్‌బాబును పిలిపించుకుని మాట్లాడినప్పటికీ ఫలితంగా లేకుండాపోవడం గమనార్హం. మైనార్టీ నియోజకవర్గంలో ముస్లిమేతరులకు టికెట్‌ కేటాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిముల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. పైగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కోటలో ఇలా చేయడం విస్తృతంగా ప్రచారం అయ్యే అవకాశాలు తీసిపారేయలేని అంశంగా మారుతుందని చెప్పవచ్చు. టికెట్‌ కేటాయింపు విషయంతో ముగ్గురు నాయకులతో చర్చించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కడప టికెట్‌ తమకే వస్తుందనే ధీమాతో ఎవరికి వారుగా ప్రచారం చేసు కుంటుండడం చర్చనీ యాంశంగా మారింది. కమలాపురం అసెంబ్లీ పరిధిలోని ఇన్‌ఛార్జికి తలనొ ప్పులు తప్పడం లేదు. ఒకవైపు ప్రముఖ వైద్యులు కృష్ణకిషోర్‌రెడ్డి, మరోవైపు పుర ప్రము ఖులు సాయినాథ్‌శర్మతోపాటు మధ్యలో నేను సైతం అంటూ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కాచుకుని కూర్చుని కొనసాగుతుండడం ఆసక్తికరంగా మారింది. మైదుకూరు టికెట్‌ రేసులో ఇన్‌ఛార్జి పుట్టాకుతోడు మాజీ మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి పేరు వినిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా కేడర్‌లో గందరగోళం కొనసాగుతోంది. ఉదాహరణకు ఒక్క బి.మఠం మండలంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసిపికి సుమారు ఐదు వేల మెజార్టీ లభించిన సంగతి తెలిసిందే. ఇటువంటి చోట ప్రతిపక్ష టిడిపికి నాయకత్వ సమస్య కొరవడింది. ఫలితంగా అక్కడ మెజార్టీ సాధించడం ప్రశ్నార్థకంగా మారింది. ప్రొద్దుటూరులో క్వాండ్రాగుల్‌ ఫైట్‌ రసవత్తంగా నడుస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రవీణ్‌, సీనియర్‌ నాయకుడు వరదరాజులరెడ్డి, జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి, సిఎం సురేష్‌నాయుడు మధ్య హోరాహారీ టికెట్‌ పోరు నడుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ముగింట అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేతో పోటాపోటీగా రాజకీయం చేయడం సమస్యగా మారింది. ముగ్గురి మధ్య సయోధ్య నెలకొల్పితే రాజకీయంగా పోటాపోటా రాజకీయం నడిచే అవకాశం ఉంది. జమ్మలమడుగులో ఇన్‌ఛార్జి భూపేష్‌రెడ్డి పాదయాత్ర హల్‌చల్‌ చేస్తో ంది. టికెట్‌ కేటాయింపు విషయంలో స్పష్టత కొరవడింది. తన చిన్నాన్న మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సీన్‌లోకి వస్తే పరిస్థేతిమిటనే అభద్రత మధ్య రాజకీయం నడుస్తోంది. బిజెపి తరపున పోటీ చేస్తే తమ భవిష్యత్‌ ఏమిటనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పులివెందులలో బి.టెక్‌ రవిని ఇన్‌చార్జిగా ప్రకటిం చడం వరకు బాగుంది. కానీ నియో జకవర్గంలోని గ్రూపుల సంగతిని విస్మరించారు. గతంలో వైసిపికి గట్టి ప్రత్యర్థిగా ముద్రపడిన ఎస్‌.వి సతీష్‌రెడ్డిని విస్మరిం చడం బలహీ నతగా మారనుంది. ఎమ్మెల్సీ రాంగో పాల్‌రెడ్డి మినహా దిక్కు లేని పరిస్థితి నెలకొంది. బద్వేల్‌లో కీ.శే బిజీవేముల వీరారెడ్డి మనవడు రితేష్‌రెడ్డి పాద యాత్ర చర్చనీయాంశంగా మారింది. ఎస్‌సి రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం కావడంతో ఆయన పోటీ చేయడానికి అవకాశం లేదు. బద్వేల్‌ నియోజక వర్గంలో మూడు, నాలుగు గ్రూపుల పోరు కొనసాగుతోంది. ఇందులోనూ ఈయ నకు బద్వేల్‌, పోరుమామిళ్ల, కలసపాడు మండలాల్లో పట్టు లేకపోవడం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో టిడిపి టికెట్‌ ఇరిగేషన్‌ ఉద్యోగి రోశయ్య పేరును ప్రచారంలో పెట్టడం వరకు బాగానే ఉంది. కానీ మూడు, నాలుగు గ్రూపుల మధ్య సయోధ్య నెలకొల్పాల్సిన అవసరం ఉం ది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జిల్లాలో ప్రతిపక్ష టిడిపి అధ్యక్షులు చంద్ర బాబు ఏమేరకు దిశానిర్దేశం చేయనున్నారనే అంశంపై ఫలితాలు ఆధార పడి ఉంటాయని చెప్పవచ్చు. ఏదేమైనా ప్రతిపక్ష టిడిపి కేడర్‌లో ఆత్మ స్థైర్యం నెలకొల్పడానికి గట్టిగా కాయకల్ప చికిత్స చేయాల్సిన అవసరం ఉరుముతోంది.

➡️