టిడిపి-జనసేన కూటమి విజయం ఖాయం

Jan 9,2024 22:00

 ప్రజాశక్తి- బొబ్బిలి :  రానున్న ఎన్నికల్లో టిడిపి-జనసేన కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు అన్నారు. రాజా కళాశాల మైదానంలో బుధవారం జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపికి ఆదరణ లభిస్తోందన్నారు. చంద్రబాబు సభలు జయప్రదం అవుతున్నాయని, బొబ్బిలి సభ కూడా జయప్రదం అవుతుందని తెలిపారు. నేడు ముగ్గురు సర్పంచులు చేరికచంద్రబాబు సమక్షంలో ముగ్గురు వైసిపి సర్పంచులు టిడిపిలో చేరనున్నట్లు టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి బేబినాయన చెప్పారు. రాజా కళాశాల మైదానంలో చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన కూడా పరిశీలించారు. ఈ సభకు బొబ్బిలి గర్జన సభగా నామకరణం చేశామన్నారు. చీకటి రోజులు పోవాలంటే టిడిపి రావాలిరాష్ట్రంలో చీకటి రోజులు పోవాలంటే టిడిపి రావాలని టిడిపి పరిశీలకులు కూన రవికుమార్‌ అన్నారు. వైసిపి అరాచక పాలనపై బుధవారం రాజా కళాశాల మైదానంలో చంద్రబాబు బొబ్బిలి గర్జన సభను జయప్రదం చేయాలని కోటలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అహంకారం పోవాలంటే జగన్‌ పోవాలన్నారు. టిడిపి, జనసేన అధికారంలోకి వస్తే చీకటి రోజులు పోయి మంచి రోజులు వస్తాయన్నారు. సమావేశంలో పొలిట్‌ బ్యూరో సభ్యులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, నియోజకవర్గ ఇంఛార్జి బేబినాయన తదితరులు పాల్గొన్నారు

➡️