టిడిపి, జనసేన ప్రభుత్వమే లక్ష్యం : భూపేష్‌రెడ్డి

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ రాబోవు ఎన్నికల్లో టిడిపి, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా పనిచేయాలని జమ్మలమడుగు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి చరిపిరాల భూపేష్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జనసేన కో- ఆర్డినేటర్లతోనిర్వహించారు. ముందుగా సంజామల మోటులో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం సూపర్‌ సిక్స్‌ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. ఈ సందర్భంగా భూపేష్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్‌ మోహన్‌ రెడ్డి పేద మధ్యతరగతి వారిని నిరుద్యోగులను తీవ్ర ఇబ్బందిపాలు చేశారన్నారు. ఇంటి పన్ను, కరెంటు చార్జీలు, బస్సుచార్జీలు పెంచారన్నారు. స్టీల్‌ ఫ్యాక్టరీ కట్టకుండా నిరుద్యోగులకు మోసం చేశారన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శివనాధరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, దేవగుడి యూత్‌, బాల పుల్లారెడ్డి బ్రదర్స్‌, జనసేన జమ్మలమడుగు కో – ఆర్డినేటర్స్‌ నల్లంశెట్టి నాగార్జున, డేరంగుల జగదీష్‌, రామ్‌ మోహన్‌, మంత్రి శీను, మునీశ్వర్‌ రెడ్డి, గురు కుమార్‌, పవన్‌, వెంకటరమణ, కష్ణ, సురేష్‌, బాలకష్ణ, అనంత నాయుడు, రామయ్య, శ్రీను, శివకష్ణ, మునిస్వామి, కష్ణారెడ్డి, రఫీ,నవీన్‌ రాయల్‌, చిన్న పుల్లయ్య, నరేంద్ర, నల్లప్ప, నరసింహులు, దేవేంద్ర, రాము, రామకష్ణ, గురు శేఖర్‌, కుళాయి రెడ్డి, మహేష్‌ రాయల్‌, ఋషి కుమార్‌, బాలాజీ, వెంకట కష్ణయ్య, చౌరెడ్డి, బెల్లా ల శ్రీను, వెంకటరమణ, రవి,నాగరాజు, ఓబులేసు,వెంకటేష్‌, భాగ్యమ్మ జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవగుడి కుటుంబ అభిమానుల పాల్గొన్నారు. వేంపల్లె : గ్రామాలు అభివద్ధి చెందాలంటే అది కేవలం టిడిపితోనే సాధ్య మవుతుందని పులివెందుల ఇన్‌ఛార్జ్‌ బిటెక్‌ రవీంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లెలోని గాంధీ రోడ్డు, మైయిన్‌ బజార్‌, అమ్మలారిశాల వీధిలో ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ’ నిర్వహించారు. బిటెక్‌ రవితోపాటు సతీమణి లతారెడ్డి, జనసేన పులివెందుల ఇన్‌ఛార్జి హరిష్‌ ఇంటింటికి వెళ్లి ఉమ్మడి జనసేన, టిడిపి మేనిఫెస్టోల కరపత్రాలను ప్రజలకు ఇచ్చి సైకిల్‌కు ఓటు వేయాలని కోరారు. అడుగడుగునా బిటెక్‌ కు ప్రజలు, టిడిపి కార్యక ర్తలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో టిడిపి మం డల పరిశీలకుడు రఘునాథ్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ రామమునిరెడ్డి, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ మహమ్మద్‌ షబ్బీర్‌, నిమ్మకాయల మహమ్మద్‌ దర్బార్‌, జయచంద్రారెడ్డి, డివి సుబ్బారెడ్డి, జగన్నాథరెడ్డి బాలస్వామిరెడ్డి, రామగంగిరెడ్డి, రెడ్డి కిషోర్‌, మహమ్మద్‌ ఇనాయతుల్లా, డక్కా రమేష్‌, గోపాల్‌ రెడ్డితో పాటు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

➡️