టిడిపి నాయకులపై సిఐ దౌర్జన్యమని ఫిర్యాదు

Mar 26,2024 23:45

ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తున్న టిడిపి నాయకులు
ప్రజాశక్తి – మాచర్ల :
టిడిపి నాయకులపై కక్ష్యసాధింపుగా వ్యవహరిస్తూ, దౌర్జన్యం చేస్తున్న కారంపూడి సిఐ చినమల్లయ్యపై విచారణ చేపట్టి తక్షణం చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో తహశీల్దార్‌కు టిడిపి నాయకులు మంగళవారం విన్నవించారు. సోమవారం సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో టి తాగుతున్న చప్పిడి రాముపై సిఐ దౌర్జన్యం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడు మాస్‌ కాపీయింగ్‌ చేశాడని ఎగతాళి చేస్తున్నారని, కారంపూడి సిఐ చినమల్లయ్య తన నోటికి వచ్చిన బూతులు అన్ని వాడినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులను కూడ తిట్టినట్లు ఫిర్యాదులో వివరించారు. తుపాకి తీసి అక్కడున్నవ వారిని భయబ్రాంతులకు గురి చేశారన్నారు. చప్పిడి రామును పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి అసభ్యంగా తిట్టి, కొట్టారని, బలవంతంగా స్టేట్‌మెంట్‌ వ్రాయించుకున్నారని, ఈ వ్యవహరంపై సమగ్ర విచారణ చేపట్టి అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ వై.మల్లికార్జునరావు, తెలుగుయువత రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కె.శివారెడ్డి, చప్పిడి రాము, వి.నాయక్‌, జనసేన నాయకులు బి.రామాంజనే యులు, కె.లాల్‌క్రిష్ణ, టి.కొండలు ఉన్నారు.

➡️