టిడిపి నాయకుల నిరసన

ప్రజాశక్తి-టంగుటూరు: బాపట్లలో టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని టిడిపి నాయకులు డిమాండ్‌ చేశారు. టంగుటూరులోని బస్‌ స్టాప్‌ సెంటర్‌ వద్ద ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద టిడిపి నాయకులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలలో చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి తారక రామారావు అని కొనియాడారు. ఎన్‌టిఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు కామని విజయకుమార్‌, పట్టణ అధ్యక్షుడు కామని నాగ శ్రీను, తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, నాయకులు ధర్నాసి బ్రహ్మానందం, రమేష్‌ బాబు, మద్దిరాల వెంకట్రావు పాల్గొన్నారు.

➡️