ట్రై సైకిల్‌ అందజేత

ప్రజాశక్తి-శింగరాయకొండ: శింగరాయకొండలోని స్నేహ హస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కీర్తిశేషులు అలహరి విశాలాక్ష్మి జ్ఞాపకార్థకంగా గురువారం రాత్రి దివ్యాంగురాలికి మూడు చక్రాల సైకిల్‌ను అందజేశారు. ఇత్తడి శాంతకుమారి అనే దివ్యాంగురాలికి రూ.12,000 విలువ చేసే ఈ సైకిల్‌ను ఫౌండేషన్‌ చైర్మన్‌ శీలం రాము ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ చిగురుపాటి రాకేష్‌, చుక్క కిరణ్‌కుమార్‌, సుదర్శి వెంకట్రావు, కొక్కిలిగడ్డ హనుమంతరావు ఉన్నారు.

➡️