డంపింగ్‌యార్డు మార్చాల్సిందే

Feb 17,2024 21:20

ప్రజాశక్తి – పాలకొండ : స్థానిక నగర పంచాయతీ పరిధిలోని కొత్త వీధి సమీపంలో ఉన్న డంపింగ్‌ యార్డ్‌ మార్చాల్సిందేనని పట్టణ పౌర సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం నగర పంచాయితీ కమిషనర్‌ సర్వేశ్వరావుతో కలిసి సమావేశమయ్యారు. కొట్టవీధి ప్రాంతంలో చెత్త వేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని చుట్టూ పక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాడుతున్నారని తెలిపారు. దీనికి కమిషనర్‌ స్పందిస్తూ 1,2,19,20 వార్డులకు ఆనుకొని ఉన్న డంపింగ్‌యార్డును అక్కడ నుంచి తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని తెలిపారు. ఈ డంపింగ్‌ యార్డ్‌లో చెత్త వేయమని, అక్కడ ఉండే చెత్తను తరలిస్తామని, అలాగే ప్రత్యామ్నాయ మార్గాన్ని చూస్తున్నామని తెలిపారు. దీనిపై ఇప్పటికే పాలకవర్గ సభ్యులతో మాట్లాడామన్నారు. పాలకులు, 1,2,19,20 వార్డు ప్రతినిధులతో జాయింట్‌ సమావేశం వేసి రాత పూర్వకమైన మినిట్‌ కాఫీ ఇస్తామని కమిషనర్‌ హామీ ఇచ్చారు. కమిషనర్‌ను కలిసిన వారిలో టిడిపి పట్టణ అధ్యక్షులు గంటా సంతోష్‌, ఒకటో వార్డు కౌన్సిలర్‌ పడాల రాంబాబు (ప్రతినిధి) గారు, వైసిపి పట్టణ నాయకులు కోరాడ సూర్య నారాయణ (బాబు), జనసేన నాయకులు పోరెడ్డి ప్రశాంత్‌, సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణ, టిడిపి నాయకులు నమ్మి కృష్ణ, కె.చిట్టిబాబు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

➡️