డిప్యూటీ తహశీల్దార్‌కు అంగన్వాడీల వినతి

Jan 10,2024 14:55 #Anganwadi strike, #ongle

ప్రజాశక్తి-కంభం(ప్రకాశం) : జీవో నెంబర్‌ 2ను రద్దు చేయాలని ,అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కదులాపురం సెంటర్‌ నుంచి డిప్యూటీ తహశీల్దార్‌ కార్యలయం వరకు అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు కన్వీనర్‌ షేక్‌ అన్వర్‌ భాష, ఏఐటీయూసీ నాయకులు షేక్‌ ఇబ్రహీం కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాల అంగన్వాడీ,కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.

➡️