తడిసిన ధాన్యం పరిశీలన

తడిసిన ధాన్యం పరిశీలన

ప్రజాశక్తి-రౌతులపూడిఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రతిపాడు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరుపుల సత్యప్రభ ఆదివారం పరిశీలించారు. ములగపూడిలో స్థానిక సర్పంచ్‌, మండల టిడిపి అధ్యక్షుడు సత్యనారాయణ, ఎంపిపి గంటిమల్ల రాజ్యలక్ష్మి, ఎంపిటిసి సోమరౌతు రవి తదితర నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. నష్టపోయిన ప్రతి రైతుకూ పంట నష్టపరిహారాన్ని మంజూరు చేసి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బిసి సెల్‌ జిల్లా అధ్యక్షుడు పైల సాంబశివరావు ఉన్నారు

➡️