తహశీల్దారు మధుకు సత్కారం

ప్రజాశక్తి-చీమకుర్తి: చీమకుర్తి తహశీల్దారు పిన్నిక మధుసూదనరావును సిబ్బంది సత్కరించారు. సుధీర్ఘ కాలం చీమకుర్తి, సంతనూతలపాడు (ఎఫ్‌ఎసి) మండలాల తహశీల్దారుగా పనిచేసి ఎన్నికల బదిలీలో భాగంగా గుంటూరు జిల్లాకు బదిలీపై వెళ్ళుతున్నందున వారిని చీమకుర్తి తహసీల్దారు వారి కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ డి వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన చీమకుర్తి, సంతనూతలపాడు కార్యాలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి చీమకుర్తి కార్యాలయ డిటిలు సాయి, శాంతి, సంతనూతలపాడు ఇడిటి శీలం శ్రీనివాసరావు, ఆర్‌ఎస్‌డిటి సుభాని, ఎఎస్‌ఒ రామచంద్రరావు, ఆర్‌ఐ శివరామిరెడ్డి, మండల సర్వేయర్‌ రాజేష్‌, సీనియర్‌ అసిస్టెంట్స్‌ కొండారెడ్డి, రమణయ్య, ఎపి విఆర్‌ఒ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి, చీమకుర్తి, సంతనూతలపాడు గ్రామ రెవెన్యూ అధికారులు, కంప్యూటర్‌ ఆపరేటర్స్‌, గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు.

➡️