తాడోపేడో తేల్చుకుంటాం

Dec 13,2023 21:35

ప్రజాశక్తి-పార్వతీపురంటౌన్‌  :   సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం రెండో రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఐసిడిఎస్‌ కార్యాలయాల వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గబోమని, తాడో పేడో తేల్చుకుంటామని తెగేసి చెప్పారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టంచేశారు. అంగన్వాడీల సమ్మెలో భాగంగా రెండో రోజు బుధవారం పార్వతీపురం పట్టణంలోని కలెక్టరేట్‌ ఎదుట నిరసన దీక్షలు కొనసాగాయి. ఈ ప్రభుత్వానికి మనసు మారాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి జ్ఞానోదయం కలగాలని కార్తీక మాసం చివరిరోజు పోలి పాడ్యమి సందర్భంగా దీపాలను వెలిగించి, వినూత్న రీతిలో నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంటా జ్యోగి మాట్లాడుతూ అంగన్వాడీలపై ప్రభుత్వం బెదిరింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. అంగన్వాడీల సమ్మెకు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజరు చంద్ర మద్దతు తెలిపారు. అంగన్వాడీలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న జగన్‌ ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించాలంటే కక్షగట్టి వేధిస్తోందని ధ్వజమెత్తారు. అంగన్వాడీల న్యాయమైన పోరాటానికి టిడిపి సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. సమ్మెకు సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు మురళీమోహన్‌ , గిరిజన సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పి.రంజిత్‌ కుమార్‌, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు మర్రాపు అలివేలు, సాలూరు గౌరీమణి, శాంతి,తదితరులు పాల్గొన్నారు. సీతానగరం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీ యూనియన్‌ ఆధ్వర్యాన రెండో రోజు నిరసన దీక్ష కొనసాగింది. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నుంచి పంచాయతీ కార్యాలయం వరకు అంగన్వాడీలు ర్యాలీ చేపట్టారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. సిఐటియు నాయకులు జి.వెంకటరమణ, ఆర్‌.ఈశ్వరరావు, వై.రామారావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శైలజ, సునీత, సత్యవతి, లక్ష్మి పాల్గొన్నారుకురుపాం : కురుపాంలో అంగన్వాడీల సమ్మె శిబిరానికి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి టి.జగదీశ్వరి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం.శ్రీనివాసరావు, కె.సీతారాం, వి.తిరుపతిరావు, టిడిపి నాయకులు గురాన శ్రీరామ్మూర్తి, రొబ్బ లోవరాజు, సుకేష్‌ చంద్ర పండ, యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పి.సరళా కుమారి, జిల్లా కార్యదర్శి కె.సరోజ పాల్గొన్నారు.పాచిపెంట : ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద రెండో రోజు అంగన్వాడీలు నిరసన దీక్ష చేపట్టారు. వీరికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు టి.ప్రభావతి, ఎం.బంగారమ్మ, రమాదేవి, సుగుణమ్మ పాల్గొన్నారు.మక్కువ : మక్కువలో అంగన్వాడీలు చేపట్టిన నిరసన దీక్ష శిబిరాన్ని టిడిపి సీనియర్‌ నాయకులు మామిడి ప్రసాద్‌నాయుడు సందర్శించి, సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పి.మల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.గరుగుబిల్లి : అంగన్వాడీల సమ్మెలో భాగంగా రెండోరోజు మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ర్యాలీ నిర్వహించారు. వీరికి సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి వై.మన్మథరావు, నాయకులు బి.వి.రమణ, మండల కార్యదర్శి దాసరి వెంకట నాయుడు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి జి.జ్యోతి, ప్రాజెక్టు నాయకులు సిహెచ్‌ గౌరమ్మ, ఎం.సావిత్రి, పద్మావతి, సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.సాలూరు : అంగన్వాడీల రెండో రోజు సమ్మెలో భాగంగా రామాథియేటర్‌ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ శిబిరాన్ని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, పట్టణ నాయకులు బి.అశోక్‌, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు పట్టణ అధ్యక్షులు బి.రాధ, కార్యదర్శి వరలక్ష్మి, మండల కమిటీ అధ్యక్షులు ఎ.నారాయణమ్మ, కార్యదర్శి శశికళ, నాయకులు శ్యామల, తిరుపతమ్మ, పార్వతి, అరుణ పాల్గొన్నారు.బలిజిపేట : స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల బయట అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె శిబిరాన్ని టిడిపి, జనసేన, ఎపిటిఎఫ్‌ నాయకులు సందర్శించి, మద్దతు తెలియజేశారు. ఎపిటిఎఫ్‌ నాయకులు ధనంజయ నాయుడు,. టిడిపి నాయకులు వేణు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : గుమ్మలకీëపురంలో రెండో రోజు చేపట్టిన అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌ సందర్శించి, సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో చెముడుగూడ ఎంపిటిసి మండంగి రమణ, అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కస్తూరి, సత్యవతి పాల్గొన్నారు.

➡️